15 మంది తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్

నవతెలంగాణ –  మల్హర్ రావు
వన్య ప్రాణుల వేటతో గతంలో సంబంధం ఉన్న 15 మందిని కాటారం తహసీల్దార్ నాగరాజు ముందు, డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బైండ్ ఓవర్ చేశారు. అడవులలో విద్యుత్ తీగల ఉచ్చులు వేసి జంతువులను వేటాడుతున్న వారిని గుర్తించిన పోలీసులు, హెచ్చరికగా రూ.లక్ష  పూచికతో 15 మందిని తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు నాగార్జున రావు, సంజీవరావు, ఎస్ ఐ అభినవ్ పాల్గొన్నారు.
Spread the love