ట్రాక్టర్ బోల్తా పడి 15 మంది మృతి..

నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చెరువులో ట్రాక్టర్ బోల్తా పడి 8మంది పిల్లలు సహా..15 మంది మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాష్ట్రంలోని ఎటాహ్ జిల్లాకు చెందిన కొంత మంది ప్రజలు పౌర్ణమి సందర్భంగా గంగానదిలో పుణ్యస్నానం చేసేందుకు కస్‌గంజ్‌లోని కదర్‌గంజ్ ఘాట్ వద్దకు ట్రాక్టర్‌లో వెళ్తున్నారు. ఈ క్రమంలో రియావ్‌గంజ్ పాటియాలీ రోడ్డులోని గధాయ్ గ్రామ సమీపంలో రోడ్డుపై వెళ్లున్న కారును ట్రాక్టర్ ఢికొట్టింది. దీంతో వెంటనే అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు ఉన్నట్టు అలీఘర్ రేంజ్ ఐజి శలభ్ మాథుర్ తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మెరుగైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Spread the love