నవతెలంగాణ -మహరాష్ట్ర: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణె సిటీలోని చించ్వాడ్ ప్రాంతంలోగల కుడల్‌వాడి ఏరియాలో ఏకంగా 150 స్క్రాప్ షాపులకు మంటలు అంటుకున్నాయి. దాంతో ఏరియా అంతటా పెద్దఎత్తు మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగకమ్మింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకుని ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. అర్థరాత్రి 1.30 గంటలకు ప్రమాదం జరుగగా తెల్లవారుజామున మంటలు అదపులోకి వచ్చాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.