హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్ తీరంలో మరోసారి కార్ రేసింగ్ జరుగనుంది. శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. నెక్లెస్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్, సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కంపౌండ్, ఐమ్యాక్స్ వరకు లీగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 11 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. దీంతో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ థియేటర్ల వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.