భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

నవతెలంగాణ – ఢిల్లీ
దక్షిణ చైనాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుయిజౌ ప్రావిన్స్‌లోని పంగువాన్ పట్టణం షాంజియావోషు బొగ్గు గనిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు. కన్వేయర్ బెల్ట్‌లో మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో మంటల్లో చిక్కుకుని వారంతా మృతి చెందినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. నేటికీ విద్యుత్ కోసం బొగ్గుపై ఎక్కువగా చైనా ఆధారపడుతోంది.
Spread the love