– పదిమంది పార్టీల అభ్యర్థులు ఏడుగురు స్వతంత్రులు
– పోటీ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
నవతెలంగాణ- మద్నూర్: రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీలో మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు వీరిలో పదిమంది పార్టీలకు చెందిన అభ్యర్థులు కాగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరందరికీ ఎన్నికల అధికారులు గుర్తులను కేటాయించారు. పార్టీల అభ్యర్థులకు పార్టీల గుర్తింపులు రాగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులకు ప్రైవేటు గుర్తింపులు కేటాయించారు. ఈపాటి కె పదిమంది అభ్యర్థులు పార్టీల గుర్తుతో ప్రచారాలు ముమ్మరం చేయగా ఇక స్వతంత్ర అభ్యర్థులు వారికి గుర్తులు కేటాయించడంతో వారు కూడా గుర్తు పేరుతో ప్రచారాలు చేయనున్నారు.