బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 17 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు వెళ్తున్న బస్సు స్థానిక యూనియన్‌ పరిషత్‌ కార్యాలయం సమీపంలో ఉదయం ఆటో రిక్షాకు సైడ్‌ ఇస్తుండగా.. డ్రైవర్‌ చక్రాల నియంత్రణ కోల్పోవడంతో చెరువులో పడిపోయిందని ఝలకతి సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ అధికారి నసీర్‌ ఉద్దీన్‌ తెలిపారు. ఈ ప్రమాదంలో కనీసం 35 మంది ప్రయాణికులు గాయపడగా, వారిని ఝలకతి జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది బస్సును జలదిగ్బంధం నుంచి వెలికి తీశారు. బస్సులో 60 నుంచి 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. జిల్లా సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ జహీరుల్‌ ఇస్లాం ప్రకారం.. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలం నుంచి 13 మతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో ఐదుగురిని బరిషల్‌లోని షేర్‌-ఎ-బంగ్లా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.
లారీని ఢకొీట్టిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురు మృతి
అన్నమయ్య: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- లారీ ఢకోీట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎనిమిది మంది గాయడగా.. వారిని రాజంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి కడప వెళ్తున్నది. ఈ తరుణంలో పుల్లంపేట మండలంలో లారీని ఆర్టీసీ బస్సు ఢకొీట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. సంఘటనా స్థలం క్షతగాత్రుల హాహాకారాలతో దద్దరిల్లింది.

Spread the love