ఇజ్రాయెల్‌ దాడుల్లో 174 మంది మృతి

Israel Hamas warనవతెలంగాణ – గాజా: హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో ప్రజల మరణాలను, విధ్వంసాన్ని నివారించడంతోపాటు జన హనన చర్యలను మానుకోవాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించి రోజైనా గడవక మునుపే గాజాపై ఇజ్రాయెల్‌ మళ్లీ భీకర దాడులు ప్రారంభించింది. 24 గంటల వ్యవధిలో 174 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా మరో 310 మంది గాయపడినట్లు శనివారం గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం ఉదయం రఫాలో ఓ నివాసంపై జరిగిన దాడిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చనిపోయారని స్థానిక అధికారులు తెలిపారు.

Spread the love