నిజామాబాద్ నగర ప్రజలు తేదీ 17-9-2024 నాడు ఉదయము 11 గంటల నుండి రాత్రి 1:00 గంటల వరకు గణపతి నిమజ్జన రధ శోభాయాత్ర ఉత్సవము ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదివారం తెలిపారు. ఈ మేరకు రథ శోభాయాత్ర ఉత్సవం రూట్ మ్యాప్ దుబ్బా చౌరస్తా నుండి రైల్వే గేట్, గంజి, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బోధన్ బస్ స్టాండ్, 2-టౌన్ బ్యాక్ సైడ్ బర్కత్పురా, గురుద్వారా నుండి లక్ష్మీ మెడికల్ బడా బజార్ చౌరస్తా, గోల్ హనుమాన్ చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా మీదుగా వినాయకుల భావి వరకు ఇట్టి రథయాత్ర కొనసాగుతుందని తెలియజేశారు. కావున నిజామాబాద్ నగర ప్రజలు తెలిపిన మార్గంలో వేరే వాహనాలకు అనుమతి లేదు అని తెలిపారు. కొన్ని మార్గాలలో దారి మళ్లింపు చేయడం జరిగిందని సూచించారు.హైదరాబాద్ వైపు నుండి నిజామాబాద్ కు వచ్చే ఆర్టీసీ వాహనాలు మాధవ నగర్, కంటేశ్వర్ బైపాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ కు రాగలరని ప్రయాణికులకు తెలిపారు. బోధన్ వెళ్లే ఆర్టీసీ వాహనాలు రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, బైపాస్, న్యూ కలెక్టరేట్, అర్సపల్లి రైల్వే మీదుగా బోధన్ వైపు వెళ్లాలి అని తెలియజేశారు. బాన్సువాడ వెళ్లే వాహనాలు రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, కోర్ట్ సర్కిల్, పూలాంగ్ చౌరస్తా, ఆర్ ఆర్ చౌరస్తా, వర్ని చౌరస్తా మీదుగా బాన్సువాడ వైపు వెళ్లాలి అని సూచించారు.హైదరాబాద్ వైపు నుండి బోధన్ వెళ్లే భారీ వాహనాలు మాధవ నగర్, బైపాస్, న్యూ కలెక్టరేట్, అర్సపల్లి రైల్వే గేట్ మీదుగా బోధన్ వైపు వెళ్లాలి అని తెలియజేశారు.కావున నగర ప్రజలు ఇట్టి విషయాన్ని గమనిస్తూ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించగలరని కోరారు.