నేటి నుంచి ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 18 శాతం జిఎస్‌టి

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ గేమింగ్‌పై నేటి నుంచి జిఎస్‌టి అధిక పన్ను శాతం అమల్లోకి రానుంది. అక్టోబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లలో బెట్టింగ్‌ల తదితర వాటిపై 28 శాతం పన్ను విధించేలా వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విధించనున్నారు. దీనికి ఆగస్టు 2వ తేదీన జరిగిన 51వ జిఎస్‌టి మండలి భేటీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇంతక్రితం ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ, కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లపై18 శాతం జిఎస్‌టి వసూలు చేశారు.
మారుతి సుజుకికి నోటీసులు..
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి జిఎస్‌టి అధికారులు నోటీసులు ఇచ్చారు. వడ్డీ, పెనాల్టీలతో పాటు రివర్స్‌ ఛార్జ్‌ ప్రాతిపదికన నిర్దిష్ట సేవలకు సంబంధించి రూ. 139.3 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. జిఎస్‌టి అధికారుల నుంచి నోటీసు అందిన విషయం వాస్తవమేనని మారుతి సుజుకి తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

Spread the love