నవతెలంగాణ – జమ్మూకశ్మీర్: జమ్మూ కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాంబా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సమోత్ర చన్నీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు కూలీలు, వారి కుటుంబ సభ్యులు అని అధికారులు తెలిపారు. కూలీలంతా ఇటుక బట్టీలో పనిచేసేందుకు కశ్మీర్ వైపు వెళ్తున్నట్లు చెప్పారు.