రెండు ఏటీఎంలలో రూ.19లక్షలు చోరీ

నవతెలంగాణ- హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దొంగలు రెచ్చిపోయారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్లోని  రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు.  ఏటీఎంల లోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్లను కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. రెండు ఏటీఎంలలో మొత్తం రూ. 18 లక్షల 99 వేల నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు.

Spread the love