అయిదు హామీలకు 19913 దరఖాస్తులు…

– ఇతర సమస్యల పైనా 2727 వినతులు…
– ముగిసిన ప్రజా పాలన..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న అయిదు హామీల పధకాలకు 19913 దరఖాస్తులు అందాయి.ఇందులోనే ఇతర సమస్యలు పరిష్కరించాలని మరో 2727 వినతి పత్రాలు అందాయి. గతేడాది డిసెంబర్ 28 ప్రారంభించిన గ్రామసభలు మండలంలో మొత్తం 30 పంచాయితీల్లో వారం రోజులు నిర్వహించారు. ఈ గ్రామ సభలు శనివారంతో ముగిసాయి.అయితే మండలం మొత్తం19622 కుటుంబాలు నుండి 19913 దరఖాస్తులు, ఇతర సమస్యలు పరిష్కారం మరో 2727 దరఖాస్తులుతో మొత్తం 22640 దరఖాస్తులు అందినట్లు మండల ప్రత్యేక అధికారి, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి పురంధర్ తెలిపారు.
Spread the love