నాలుగు రోజుల్లో 2 కోట్ల మంది భక్తులు : పొంగులేటి

నవతెలంగాణ – హైదరాబాద్‌ : ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న శ్రీ సమ్మక్క, సారలమ్మ మేడారం జాతరకు అన్ని వసతులు కల్పించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం సహచరమంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల రద్దీకి అనుగుణంగా మేడారం జాతరకు ఎక్కువ బస్సులు కేటాయించామన్నారు. ఇప్పటిరకు 17 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌తో బస్సుల్లో ప్రయా ణించారని చెప్పారు. నాలుగు రోజుల్లో 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. మేడారం జాతర వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తూ బడ్జెట్ కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.

Spread the love