వర్షంలో కొట్టుకుపోయిన రూ. 2 కోట్ల బంగారం..

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గత రెండు రోజులుగా బెంగుళూరు మహానగరంలో భారీగా వరుసలు కురుస్తున్నాయి. ఎంతగా అంటే ఏ వర్షపు ధాటికి కాలనీలు అన్నీ కూడా అతలాకుతలం అయిపోయాయి. ఎక్కడ చూసినా వార్హపునీరు నిండిపోయి అస్తవ్యస్తంగా ఉంది. బెంగుళూరు లోని మల్లీశ్వరం లో 9వ క్రాస్ రోడ్ లో ఒక వింత చోటు చేసుకుంది. ఈ ఏరియాలో ఉన్న ఒక బంగారు షాపులు వర్షం నీరు భారీగా చేరడంతో షాప్ అంతా కూడా పాడైపోయి.. ఈ వర్షపు నీటిలో షాపులో ఉన్న బంగారం కొట్టుకుపోయింది. దీనితో ఆ షాపు యజమానికి కోట్లలో నష్టం వచ్చినట్లు తెలిపాడు. షాపులో ఉన్న నగలలో 80 శాతం ఆ వర్షంలోనే కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇటువంటి పరిస్థితిలోసదరు యజమాని కార్పొరేషన్ కు ఫోన్ చేసినా వారెవరూ సమయానికి స్పందించకపోవడంతో బంగారం అంతా క్షణాలలో మాయమైంది.

Spread the love