సీఎం సహాయ నిధికి రూ.2 కోట్లు

సీఎం సహాయ నిధికి రూ.2 కోట్లు– రేవంత్‌రెడ్డికి ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అందజేత
నవతెలంగాణ-ఖమ్మం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లగా.. వారిని ఆదుకునేందుకు ప్రభు త్వానికి తన వంతుగా చేయూత నిచ్చేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ముందుకొచ్చారు. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ డైరెక్టర్‌ నరసింహారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. రేస్‌ క్లబ్‌ తరఫున రూ.2కోట్ల చెక్కును అందజేశారు. వరద బాధితుల కోసం పెద్దమొత్తంలో అందజేయడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love