నవతెలంగాణ – మాక్లూర్
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. రెండు లక్షల రుణమాఫి, రైతు భరోసా రూ. 15 వేలు యుద్ధ ప్రతి పడికన అమలు చేయాలని మండల రైతు కార్య చరణ కమిటీ ఆద్వర్యంలో డిమాండ్ చేశారు. గురువారం మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫి ఏక కాలంలో చేయాలని, రైతు భరోసా ఇవ్వలని కోరారు. అనంతరం తహశీల్దార్ శేఖర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతు కార్య చరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.