యూసఫ్‌గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు మంటల్లో ఆహుతి!

నవతెలంగాణ – హైదరాబాద్‌: నగరంలోని యూసఫ్‌గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్‌లో సెకండ్‌ హ్యాండ్‌ కార్లు విక్రయించే ‘నాని కార్స్‌’లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 20 కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Spread the love