ఏపీలో 20 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ

ఏపీలో 20 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ– 16 టీడీపీ, మూడు జనసేన, ఒకటి బీజేపీకి
అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వం మంగళవారం 20 కార్పొరేషన్లకు నామినేటెడ్‌ ఛైర్మన్లు, మెంబర్లను ప్రకటించింది. ఈ జాబితాలో 16 టీడీపికి, మూడు జనసేనకు, ఒకటి బీజేపీకి ఛైర్మన్‌ పోస్టులు దక్కాయి. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా అబ్ధుల్‌ అజీజ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఎపి ఛైర్మన్‌గా (శాప్‌) అనిమిని రవినాయుడు, ఎపి హౌసింగ్‌ బోర్డు ఛైర్మన్‌గా బత్తుల తాత్యబాబు, ఎపి షెడ్యూల్డ్‌్‌ తెగల సహకార ఆర్దిక సహకారం (ఎపి ట్రైకార్‌) బొరగం శ్రీనివాసులు, ఎపి మారిటైమ్‌ బోర్డు ఛైర్మన్‌గా దామచర్ల సత్య, సీడ్‌ ఎపి ( ఉపాధి కల్పన అండ్‌ ఎంటర్‌ ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ) దీపక్‌రెడ్డి, 20 సూత్రాల పాయింట్‌ ఫార్ములా ఛైర్మన్‌ లంకా దినకర్‌ (బిజెపి), ఎపి మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా కర్రోతు బంగార్రాజు, ఎపి స్టేట్స్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా మన్నె సుబ్బారెడ్డి, పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి సంస్ధకు నందం అబద్దయ్య, ఎపి టూరిజం డెవలపమెంట్‌ కార్పొరేషన్‌కు నూకసాని బాలాజి, ఎపిఎస్‌ఆర్‌టిసి ఛైర్మన్‌గా కొనకళ్లనారాయణ, వైస్‌ ఛైర్మన్‌గా పిఎస్‌ మునిరత్నం, ఎపి అర్భన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు పీలా గోవింద సత్యనారాయణ, లెదర్‌ ఇండిస్టీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు పిల్లి మాణిక్యాలరావు, ఎపి రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలికి పీతల సుజాత, ఎపి మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ ప్రైజస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు తమ్మిరెడ్డి శివశంకర్‌ (జనసేన), రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌కు తోట మెహర్‌ సుదీర్‌ (జనసేన), ఎపి ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎపిటిపిసి) వజ్జాసుబ్బారావు, ఎపి టౌన్‌ షిప్‌ మౌలిక సదుపా యాల అభివృద్ది కార్పొరేషన్‌ (ఎపి టిడ్కో) ఛైర్మన్‌గా వేములపాటి అజరుకుమార్‌ (జనసేన)లను నియమించారు. రెండో లిస్ట్‌ ఈ నెల 25, 26న వెలువడే అవకాశముంది.

Spread the love