స్కూల్ ట్యాంక్‌లోని నీరు తాగి.. 20 మంది విద్యార్థులు అస్వస్థత

నవతెలంగాణ – రాంచీ: స్కూల్ ట్యాంక్‌లోని నీరు తాగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దురులోని అప్‌గ్రేడ్ అయిన ప్రైమరీ స్కూల్‌లో శనివారం మధ్యాహ్నం భోజనం తర్వాత విద్యార్థులు అక్కడి ట్యాంక్‌లోని నీరు తాగారు. కొంత సేపటి తర్వాత చాలా మంది వాంతులు చేసుకున్నారు.  కాగా, సుమారు 20 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురికావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడ్మిట్‌ చేసి చికిత్స అందించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Spread the love