200 గంటలు శ్రమధానానికి కేటాయించాలి

– స్వచ్ఛత హి సేవ అవగాహన ర్యాలీలో సర్పంచ్ మంజుల 

నవతెలంగాణ-బెజ్జంకి 
మహాత్మ గాంధీ కలలు కన్న స్వచ్ఛమైన భారత దేశం కోసం ప్రతి ఒక్కరూ సుమారు 200 గంటల సమయాన్ని శ్రమధానానికి కేటాయించాలని సర్పంచ్ ద్యావనపల్లి మంజుల సూచించారు. శనివారం మండల కేంద్రంలోని విద్యానికేతన్ పాఠశాల అధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత హి సేవ అవగాహన ర్యాలీలో సర్పంచ్ మంజుల, వార్డ్ సభ్యుడు లింగాల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది హజరై స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. విద్యానికేతన్ పాఠశాల బోధన సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love