రోండి రాజు ఆధ్వర్యంలో 200 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరిక

నవతెలంగాణ-ధర్మసాగర్
ధర్మసాగర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొదటి ఎంపీటీసీ రోండి రాజు ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలను బిఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి సారద్యంలో సోమవారం చేరడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న తీరును చూసి, అనేకమంది కాంగ్రెస్ మరి ఇతర పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందని అన్నారు. ఇదే రీతిగా ధర్మసాగర్  ఒకటవ ఎంపీటీసీ రొండి రాజు ఆధ్వర్యంలో దాదాపు కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేయడం శుభ సూచకమన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుపుతోందన్నారు. అనంతరం రోండి రాజు మాట్లాడుతూ నేడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా విడురంగా ఉందన్నారు. కార్యకర్తలను గుర్తించలేని స్థితిలో నాయకులు ఉన్నారని, ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో పురోగతి లేక ఆదిపత్య పోరులో మేము అంటే మేము అనే నినాదంతో క్రమశిక్షణ లేని పార్టీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే నేడు అధికారా దాహంతోనే అనేకమంది ఒక నిబద్ధతలేని నాయకులుగా వస్తున్న క్రమంలో మనస్థాపానికి గురై నేడు ఈ పార్ట్ లో చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రబెల్లి శరత్, ఎంపిటిసిలు వనమాల, శోభ, నాయకులు అనురాధ ఠాగూర్, బొడ్డు ప్రభుదాసు,బొడ్డు సోమయ్య, రావుల వెంకటరెడ్డి, వెంకట నరసమ్మ, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love