నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండలంలోని ప్రగతి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు, కష్టం సుఖం, ఇలా ఏదైనా కానీ మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ దైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం బాల్యం స్మృతులు కరచాలనాలు చెమ్మ గిల్లిన కళ్ళతో ఆలింగనాలు గురువుల మందలింపులు తలచుకుంటూ.. ఒకసారి వయసు మర్చిపోయి చిన్నపిల్లల కేరింతలతో సెంటినరీ కాలనీ ప్రగతి ఉన్నత పాఠశాల కోలాహలంగా మారింది. ఈ ప్రాంగణంలో అడుగుపెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఉమ్మడి కమాన్పూర్ మండలంలోని లోని ప్రగతి ఉన్నత పాఠశాల 2006-2007 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగగా మారింది దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఎక్కడికో వెళ్లినవారు కొందరు ఎక్కడెక్కడో స్థిరపడిన వారు కొందరు ఉద్యోగాల్లో కొందరు సహధర్మ చరినులుగా కొందరు వివిధ స్థితుల్లో జీవిస్తూ.. కలవాలనే కలంపులో ఆనాటి విద్యార్థులైన కొంతమంది విద్యార్థులకు ఆలోచన కలిగింది. ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితిలో చిన్ననాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడిన ఆటలు పాటలు అలరించాయి. వచ్చిన పూర్వ విద్యార్థులు కాలనీ ప్రగతి ఉన్నత పాఠశాలలో పొద్దుపోయే వరకు గడిపి బరువెక్కిన హృదయాలతో ఎవరి గమ్యస్థానాలకు వారు కదిలారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గురువులు పాఠశాల ప్రిన్సిపల్ అబ్బు కేశవరెడ్డి, మిరియాల రాజిరెడ్డి నాగరాజ కుమారి, ఉపాధ్యాయులు దేవేందర్ రెడ్డి, అప్పా రెడ్డి, శేఖర్, సువర్ణ, సత్యం, సమ్మయ్య పాల్గొన్నారు.