2011 రిపీట్‌ కావాలి!

ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ట్రోఫీ టూర్‌ కోల్‌కతకు చేరుకుంది. జులై 14 వరకు భారత్‌లో ప్రపంచకప్‌ ట్రోఫీ టూర్‌ సాగనుండగా గురువారం కోల్‌కతలోని మోడ్రన్‌ హైస్కూల్‌లో జరిగిన ట్రోఫీ టూర్‌ కార్యక్రమానికి భారత క్రికెట్‌ దిగ్గజం జులన్‌ గోస్వామి హాజరయ్యారు. రోహిత్‌సేన 2023లో 2011 ధోనీసేన ప్రదర్శన పునరావృతం చేయాలని స్కూల్‌ విద్యార్థులతో కలిసి ఆకాంక్షించారు. ‘గెలుపు, ఓటమి ఆటలో భాగం. కానీ ప్రపంచకప్‌ క్రికెటర్లు ఎప్పటికీ మనకు హీరోలు. ప్రపంచకప్‌ జట్టుకు మద్దతుగా నిలిచి.. గెలుపులో భాగమవ్వండి’ అని జులన్‌ గోస్వామి అన్నారు. ప్రపంచకప్‌ ట్రోఫీ టూర్‌ తర్వాత తిరువనంతపురం, కోచి నగరాలకు చేరనుంది.

Spread the love