‘వంగవీటి, కథానాయకుడు, మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్, అక్షర, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ధమాకా, పరంపర, 9 అవర్స్, మంగళవారం’ తదితర చిత్రాలతో, విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీతేజ్. ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తున్నారు. అందులో పుష్ప2 కూడా ఉండటం విశేషం. తాజాగా తన కెరీర్ గురించి
మీడియాతో మాట్లాడుతూ, ”మంగళవారం’ ఘన విజయం సాధించి నేను చేసిన గురజ పాత్రకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ పాత్ర గురించి విన్నప్పుడు చాలా థ్రిల్ ఫీలయ్యాను. మరో కొత్త పాత్రను చేసే అవకాశం దొరికింది అని హ్యాపీగా ఫీలయ్యాను. సినిమా సూపర్‌హిట్ కావడంతో ఆ సంతోషం డబుల్ అయ్యింది. ఈ పాత్ర ఇచ్చిన దర్శక,నిర్మాతలు అజరు భూపతి, సురేష్, స్వాతికి, రవితేజ ‘రావణాసుర’లో దేవరాజ్ వంటి మంచి రోల్ ఇచ్చిన సుధీర్‌వర్మ, నిర్మాత అభిషేక్‌కి, బాగా సపోర్ట్ చేసిన రవితేజకి, ‘దళారి’లో నటించే ఛాన్స్ ఇచ్చిన నిర్మాత వెంకట్. దర్శకులు గోపాల్‌కి థ్యాంక్స్. 2023 నాకు చాలా సంతోషాల్ని ఇచ్చింది. 2024లో హీరోగా నేను నటిస్తున్న ‘బహిష్కరణ’ వెబ్‌సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే మరో చిత్రం ‘ర్యాంబో’ కూడా రెడీ అవుతోంది’ అని చెప్పారు.