నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ను అధికారులు విడుదల చేశారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 23 ఏప్రిల్ వరకు కొనసాగనున్నాయి.
- అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు
- డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల క్రిస్మస్ సెలవులు
- వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
- 28 ఫిబ్రవరి 2025లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు
- 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు
- ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలల తరగతులు
- అప్పర్ ప్రైమరీకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు