ఎయిర్‌పోర్టులో 2027 గ్రాముల హెరాయిన్‌ స్వాధీనం రూ .14.20 కోట్ల విలువ

నవతెలంగాణ – శంషాబాద్‌
హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారుల శ్రద్ధ, అప్రమత్తత, సత్వర చర్య ఫలితంగా భారీ మాదక ద్రవ్యాలు పట్టుబడ్డా యి. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం పెద్ద ఎత్తున హెరాయిన్‌ పట్టుబడింది. రిపబ్లి క్‌ ఆఫ్‌ బురుండి దేశానికి చెందిన ఒక మహిళా ప్రయాణకురాలు(43) నైరోబీ నుంచి షార్జా మీదుగా ఆదివారం ఎయిర్‌ అరేబియా ఎయిర్‌వేస్‌ ఫ్లైట్‌ నెం.జీ9-458 ద్వారా శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కు చేరుకుంది. ఖచ్ఛితమైన సమాచారం మేరకు హైదరా బాద్‌ కస్టమ్స్‌ అధికారులు ఎయిర్‌పోర్టులో ఆమెను అడ్డుకు న్నారు. ఆమె వెంట తీసుకువచ్చిన సామాగ్రి పరిశీలిం చారు. ఎనిమిది సంప్రదాయ ఆఫ్రికన్‌ దుస్తులు, ఒక మహిళ హ్యాండ్‌ బ్యాగ్‌, మూడు సబ్బులు సాధారణ బరువు కంటే ఎక్కువగా ఉన్నట్టు గమనించారు. అనుమానంతో సైడ్‌ వాల్స్‌/లేయర్‌లను జాగ్రత్తగా తెరిచారు. లేడీస్‌ హ్యాండ్‌బ్యాగ్‌, సబ్బులు, హ్యాండ్‌బ్యా గ్‌లోని ప్రతి గోడ/ లేయర్‌లలో దాచిన నలుపు / క్లియర్‌ ప్లాస్టిక్‌ ప్యాకెట్లు/ పౌచ్‌లు, డ్రెస్‌ల బటన్‌లు, సబ్బులు గమనించారు. ఆ ప్యాకెట్ల ను తెరవగా గోధుమరంగు తెల్లటి పొడిని కలిగి ఉన్నవి క్షుణ్ణంగా పరీక్షించగా హెరాయిన్‌ అని తేలింది. హ్యాండ్‌ బ్యాగ్‌లో నుంచి 2027 గ్రాముల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 14.2 కోట్లు అంతర్జాతీయ మార్కెట్‌లో ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రయాణికురాలిని ఎన్‌డీపీఎస్‌ చట్టం, 1985 కింద అరెస్టు చేసి, కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ ఆదేశా ల మేరకు రిమాండ్‌ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love