జి 20 నేపథ్యంలో 207 రైళ్లు రద్దు : 9 నుండి 11 వరకు రాకపోకలపై ఆంక్షలు

నవతెలంగాణ – న్యూఢిల్లీ : జి 20 సదస్సు నేపథ్యంలో ఉత్తర రైల్వే 207 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 9 నుంచి 11 వరకు రైళ్ల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దాదాపు 15 రైళ్ల రూట్‌ను మార్చామని, ఆరు రైళ్లను దారి మళ్లించామని రైల్వే శాఖ తెలిపింది. జమ్మూ తావీ – న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌, తేజస్‌ రాజధాని హజ్రత్‌ నిజాముద్దీన్‌, వారణాసి-న్యూఢిల్లీ తేజస్‌ రాజధానితో సహా అదనంగా 70 రైళ్లకు స్టాప్‌లు కేటాయించబడ్డాయి. న్యూఢిల్లీలో ముగియాల్సిన 36 రైళ్లు ఘజియాబాద్‌, నిజాముద్దీన్‌ స్టేషన్లలో ముగుస్తాయి. సెప్టెంబర్‌ 10న వంద ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. వీటిలో ఎక్కువ భాగం ఢిల్లీ నుండి దక్షిణ హర్యానాలోని సోనిపట్‌-పానిపట్‌, రోతక్‌, రేవారి మరియు పల్వాల్‌ మార్గాల్లో నడుస్తాయి. సెప్టెంబర్‌ 11 న ఢిల్లీ-రేవారి ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌, రేవారి-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ రైళ్లు రద్దు చేయబడ్డాయి. సిర్సా తిలక్‌ బ్రిడ్జ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 9 నుండి 11 గంటల వరకు, బరేలీ జంక్షన్‌-న్యూ ఢిల్లీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, న్యూఢిల్లీ – రోV్‌ాతక్‌ జంక్షన్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 8 నుండి 10 గంటల వరకు రద్దు చేయబడ్డాయి. రద్దు చేయబడిన రైళ్లలో న్యూఢిల్లీ – వీరాంగన లక్ష్మీబాయి తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌, న్యూఢిల్లీ – లోహియాన్‌ ఖాస్‌ జంక్షన్‌ సర్బత్‌ ఎక్స్‌ప్రెస్‌, భివానీ – తిలక్‌ బ్రిడ్జ్‌ ఎక్స్‌ప్రెస్‌, గంగానగర్‌ – తిలక్‌ బ్రిడ్జ్‌ ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీ – హరిద్వార్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌, జలంధర్‌ సిటీ జంక్షన్‌ – న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 9, 10 తేదీల్లో సమ్మిట్‌ జరగనుంది. సమ్మిట్‌ దష్ట్యా సెప్టెంబర్‌ 8 నుంచి 10 వరకు ఢిల్లీలో పబ్లిక్‌ హాలీడే ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, ప్రైవేట్‌ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయబడతాయి. ఈ మూడు రోజులు బ్యాంకులు, దుకాణాలు సహా ఆర్థిక సంస్థలు పని చేయవు. ప్రయాణికులు రైళ్ల సమాచారం, సమయాలను సరిగ్గా తనిఖీ చేసి ప్రయాణించాలని ఉత్తర రైల్వే ప్లాట్‌ఫారమ్‌ ఎక్స్‌లో పేర్కొంది.

Spread the love