2,391 కొత్త ఉద్యోగాలకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో వరుస ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు.. నిరుద్యోగుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రిపరేషన్‌ హడావిడిలో మునిగిపోయింది యువత. తాజాగా మరో 2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్తగా మరో 2,391 ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ అనుమతి ఇవ్వగా.. అందులో డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్స్‌ 480, జూనియర్‌ లెక్చరర్స్‌ 185 పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పీజీటీ 235, టీజీటీ 324 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

Spread the love