– టీపీసీసీ ప్రధానకార్యదర్శి
– భీమగాని సౌజన్య
నవతెలంగాణ-ఆత్మకూర్
24 గంటల పాటు కరెంటు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని బీఆర్‌ఎస్ ప్రభుత్వం, పాలకులు గొప్పగా చెబుతున్న అది ఆచరణలో మాత్రం కనబడడం లేదని గత నెల రోజులుగా కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక పంటలు ఎండిపోతుం డటంతో రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని టిపిసిసి ప్రధాన కార్యదర్శి భీమగాని సౌజన్య మండిపడ్డారు. ఆదివారం ఇన్‌చార్జి ఇనగాల ఆదేశాల మేరకు గీసుగొండ మండల సబ్ స్టేషన్ ముందు బైఠాయించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీపీ సౌజన్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో బోరు,బావిని నమ్ముకుని రైతులు తమ పంటలను సాగు చేస్తారని యాసంగిలో పెద్ద మొత్తంలో వరి సాగు అన్నారు. పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు రైతులు పండిస్తుంటే యాసంగి సాగుకు కొద్దీనెలల నుండి 9 గంటలు పాటు మాత్రమే సరఫరా చేస్తు న్నారని అన్నారు. మండల అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డికి భూ దందాలపై,అక్రమ మొరం దందాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని అన్నారు . రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేసి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కొనియాడారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రభుత్వం వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యోగ ఉపాధి రంగాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు దేవేందర్,జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పర్వతమ్మ,అశోక్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ కాగిత బిక్షపతి,కోసం రమేష్, అప్పని కరుణాకర్,వర్కింగ్ ప్రెసిడెంట్ నాగారపు స్వామి, బీసీ సెల్ మండల అధ్యక్షులు వజ్ర రాజు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు రుద్ర ప్రసాద్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సాంబారెడ్డి,గ్రామల అధ్యక్షు లు బూర్గుల వెంకటేష్,నల్ల సురేష్, ప్రవీణ్, పాక్స్ డైరెక్టర్ తిప్పారపు రాజు, రాజేశ్వరరావు, రాజు, కుమారస్వామి, రాజు పాల్గొన్నారు