కర్ణాటకలో నేడు 24 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

నవతెలంగాణ – బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో శనివారం సిద్ధరామయ్య మంత్రివర్గంలోకి 24 మంది కొత్త మంత్రులు చేరనున్నారు. కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి రాష్ట్ర క్యాబినెట్‌ను పొందబోతోంది. శనివారం 24 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అతని డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌ల మధ్య రోజుల తరబడి జరిగిన చర్చల తర్వాత ఈ పరిణామం జరిగింది.మే 20వతేదీన కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎం, 8మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా, శనివారం 24 మంది కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కర్ణాటక క్యాబినెట్‌లో ముఖ్యమంత్రితో సహా మొత్తం 34 మంది మంత్రులు ఉండవచ్చు. కాంగ్రెస్ ఖరారు చేసిన జాబితా ప్రకారం విస్తరించిన మంత్రివర్గంలో లింగాయత్, వొక్కలిగ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ముస్లిం, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉంటారు. శనివారం ప్రమాణస్వీకారం చేయనున్న ఎమ్మెల్యేల జాబితాలో దినేష్ గుండురావు, కృష్ణ బైరేగౌడ, ఈశ్వర్ ఖండ్రే, రహీంఖాన్, సంతోష్ లాడ్, కెఎన్ రాజన్న, కె వెంటకేశ్, హెచ్‌సి మహదేవప్ప, బైరతి సురేష్, శివరాజ్ తంగడి, ఆర్‌బి తిమ్మాపూర్, బి నాగేంద్ర, లక్ష్మి ఉన్నారు. హెబ్బాల్కర్, మధు బంగారప్ప, డి సుధాకర్, చెలువరాయ స్వామి, మంకుల్ వైద్య, ఎమ్ సి సుధాకర్. కొత్త మంత్రుల జాబితాలో ఉన్నారు. హెచ్‌కే పాటిల్, శరణ్‌ప్రకాష్ పాటిల్, శివానంద్ పాటిల్, ఎస్‌ఎస్ మల్లికార్జున, శరణ్‌బసప్ప దర్శనపుర, అలాగే ఏకైక ఎమ్మెల్సీ ఎన్‌ఎస్ బోసరాజు కూడా కాబోయే మంత్రుల జాబితాలో ఉన్నారు.ఇది కాకుండా కర్ణాటక శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా సి పుట్టరంగశెట్టి నియామకానికి సంబంధించిన ప్రతిపాదనకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా ఆమోదం తెలిపారు.

Spread the love