కిచెన్‌ ఉత్పత్తుల విభాగంలో 25% వృద్ధి లక్ష్యం

– హింద్‌వేర్‌ స్మార్ట్‌ అప్లయిన్సెస్‌ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో కిచెన్‌ ఉపకరణాల విభాగంలో 25 శాతం పైగా వృద్ధి అంచనా వేస్తున్నామని హింద్‌వేర్‌ స్మార్ట్‌ అప్లయిన్సెస్‌ తెలిపింది. ఇందుకోసం వినూత్న ఉత్పత్తులతో వంటగది ఉపకరణాల శ్రేణీని విస్తరిస్తున్నట్లు పేర్కొంది. కిచెన్‌ చిమ్నీ, బిల్ట్‌ ఇన్‌ హాబ్స్‌, ఇండక్షన్‌ కుక్‌టాప్‌ల కేటగిరీల్లో కొత్త ఉత్పత్తులను విడుదల చేసినట్టు తెలిపింది. ఈ విభాగంలో మార్కెట్‌ ఉనికిని పెంచుకోవడం, కిచెన్‌ ఉపకరణాల విభాగంలో ఎక్కువ వాటాను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.

Spread the love