నవతెలంగాణ – హైదరాబాద్: పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ.25 లక్షలు అందజేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే వారికి ప్రతి నెలా రూ.25 వేల పింఛన్ అందజేస్తామని తెలిపారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్యనాయుడు పెద్దదిక్కు అని చెప్పారు.