హైదరాబాద్ : పిట్టీ ఇంజినీరింగ్ 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 25 శాతం వృద్థితో రూ.25 కోట్ల నికర లాభాలు సాధించింది. రూ.5 ముఖ విలువ కలిగిన షేర్‌పై రూ.1.20 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.2.70 డివిడెండ్‌ను అందించినట్లయ్యింది. 2022-23లో సంస్థ స్థూల లాభాలు 13 శాతం పెరిగి రూ.59 కోట్లుగా, రెవెన్యూ రూ.1,118 కోట్లుగా నమోదయ్యింది.