25 వరకు మలబార్ గోల్డ్ , డైమండ్స్ షో రూమ్ లో వెండి ఆభరణాల ప్రదర్శన

నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట మలబార్ గోల్డ్ , డైమండ్స్ షోరూంలో 16 నుండి 25 వరకు వెండి అభరణాలు, వెండి వస్తువులను ప్రదర్శన ఉంటుందని, ఈ ప్రదర్శనలో ప్రతి రూ 5000 వెండి ఆభరణాల కొనుగోలు పై రూ.500 ప్రత్యేక తగ్గింపు, వెండి వస్తువుల పై ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయని ప్రముఖ వైద్యురాలు రమ అన్నారు. శుక్రవారం ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిబద్ధతలో భాగంగా వినియోగదారులకు 10 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుందని అన్నారు. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు, ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100 శాతం విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, నూరు శాతం బి.ఐ.ఎస్ హాల్ మార్కుతో దృవీకరించబడిన స్వచ్ఛమైన హెచ్ యు ఐ డి బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన ఐజిఐ మరియు జిఐ ఎ. దృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారెంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శివకుమార్, పిఆర్ఓ వాజీద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love