తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌.. వారికి 250 గజాల ఇంటి స్థలం

నవతెలంగాణ హన్మకొండ: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే తమ ప్రభుత్వం పనిచస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ… ఎన్నికల హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆనాడు వ్యతిరేకించారని గుర్తుచేశారు. తెలంగాణను అవమానిస్తే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమ్మేళనంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోదండరామ్, తదితరలు పాల్గొన్నారు.

Spread the love