పంట ఎండిన రైతులకురూ.25 వేల నష్టపరిహారం, రూ.500 బోనస్ ఇవ్వాలి..

నవతెలంగాణ – చివ్వెంల
పంట ఎండిన రైతులకు 25 వేల నష్టపరిహారం, రూ.500 బోనస్ ఇవ్వాలని బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు రౌతు నరసింహారావు, జూలకంటి సుధాకర్ రెడ్డి,అన్నారు. మంగళవారం మండలకేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశం లో వారు మాట్లాడుతూ..రైతులను ఆదుకోవాలని, ధాన్యానికి రూ.500 బోనస్‌, రైతు భరోసా, రైతు రుణమాఫీ హామీలు అమలు చేయాలని కోరారు . నీరు, విద్యుత్‌ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు . ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. సర్కార్‌ అలసత్వం వల్ల  జిల్లా లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీళ్లున్నా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామని చెప్పారు. కార్యక్రమంలో బి ఆర్ఎస్  యూత్ మండల ఉపాధ్యక్షులు  భూక్య నాగు నాయక్,బి ఆర్ ఎస్ నాయకులు   ఎర్పుల నగేష్,రాములు, మోర కోటేష్,తుర్క హరీష్,బానోత్ హరీష్, పెరమల్ల దిలీప్,వేముల భిక్షం, కొమరగిరి ఉపేంద్ర చారి, తుర్క నాగరాజు, భిక్షం,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love