నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాదు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అపోలో హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆద్వర్యంలో 0-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు గుండె వ్యాధులకు సంబందించి ఉచిత వైద్య శిబిరం 26 జులై 2024 (శుక్రవారం) నాడు జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ కేంద్రం (రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం -RBSK) రూమ్ నం: 435, 4వ అంతస్థు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, (GGH) ఖలీల్ వాడి నిజామాబాదు నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది అని నిజామాబాద్ వైద్య ఆరోగ్యశాఖ, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్ బుధవారం ప్రకటనలో తెలియజేశారు.
వ్యాధి నిర్ధారణ అయినచో ఉచితంగా శస్త్ర చికిత్స పత్రాలు కొత్త రేషన్ కార్డు / ఆహార భద్రత కార్డు, ఆధార్ కార్డు – పిల్లలది వారి తల్లి తండ్రులది, పిల్లలది జనన ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్), ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్కమ్ సర్టిఫికెట్) పిల్లలది/ వారి తల్లి తండ్రులది, మునుపటి ఆరోగ్య రికార్డులు తీసుకొని రావాలని తెలియజేశారు.