– ఇందులో 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలవి
– అలాగే పది కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్ల నుంచి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జనవరి 26 రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొనేందుకు మొత్తం 26 శకటాలే అర్హత సాధించాయి. ఏపీతో పాటు 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు ప్రదర్శన జరగనుంది. వీటితో పాటు పది కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌ల శకటాలు ప్రదర్శన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ (ఏటికొప్పాక బొమ్మలు- ఎకో ఫ్రెండ్లీ చెక్క బొమ్మలు), కర్నాటక (లక్కుండి: రాతి చేతిపనుల ఊయల), గోవా (గోవా: సాంస్కృతిక వారసత్వం), ఉత్తరాఖండ్ (ఉత్తరాఖండ్: సాంస్కృతిక వారసత్వం, సాహస క్రీడలు), హర్యానా ( భగవద్గీతను ప్రదర్శిస్తోంది), జార్ఖండ్ (స్వర్ణిమ్ జార్ఖండ్: ఎ లెగసీ ఆఫ్ హెరిటేజ్ అండ్ ప్రోగ్రెస్), గుజరాత్ (స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్), పంజాబ్ (పంజాబ్ జ్ఞాన భూమి), ఉత్తరప్రదేశ్ (మహాకుంభ్ 2025 – స్వర్ణిమ్ భారత్ విరాసత్ ఔర్ వికాస్), బీహార్ (స్వర్ణిం భారత్: విరాసత్ ఔర్ వికాస్ -నలంద విశ్వవిద్యాలయం), మధ్యప్రదేశ్ (మధ్యప్రదేశ్ కీర్తి: కునో నేషనల్ పార్క్- ది ల్యాండ్ చీతలు), త్రిపుర (శాశ్వత భక్తి: త్రిపురలో 14 దేవతల ఆరాధన – ఖర్చీ పూజ), పశ్చిమ బెంగాల్ (‘లక్ష్మీ భండార్’ అండ్ ‘లోక్ ప్రసార్ ప్రకల్ప’ – బెంగాల్‌లో జీవితాలను శక్తివంతం చేయడం, స్వావలంబనను పెంపొందించడం), చండీగఢ్ (చండీగఢ్: వారసత్వం, ఆవిష్కరణ, స్థిరత్వం, సామరస్య సమ్మేళనం), ఢిల్లీ (నాణ్యమైన విద్య), దాద్రా నగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ (కుక్రి స్మారక చిహ్నంతో పాటు డామన్ ఏవియరీ బర్డ్ పార్క్ – భారత నావికాదళంలోని పరాక్రమ నావికులకు నివాళి) శకటాలను ప్రదర్శిస్తారు.
సామాజిక న్యాయం, సాధికారత శాఖ (భారత రాజ్యాంగం, మన విరాసత్ (వారసత్వం), వికాస్, పథ్-ప్రదర్శక్ మూలస్తంభం), గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (జంజాతీయ గౌరవ్ వర్ష్), మహిళ, శిశుఅభివృద్ధి మంత్రిత్వ శాఖ (మంత్రిత్వ శాఖ సమగ్ర పథకాల కింద పోషించబడిన మహిళలు, పిల్లల బహుముఖ ప్రయాణం), నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (స్వర్ణిమ్ భారత్: వారసత్వం, అభివృద్ధి), గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (లఖ్‌పతి దీదీ), ఆర్థిక సేవల విభాగం (దేశం ఆర్థిక పరిణామంలో అద్భుతమైన ప్రయాణం), భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ (ఐఎండీ) (తీవ్ర వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం – ప్రాణాలను, జీవనోపాధిని కాపాడటం), పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ (స్వర్ణ భారత వారసత్వం, అభివృద్ధి దేశ స్వదేశీ పశువుల జాతులను స్థిరమైన గ్రామీణ వృద్ధికి చిహ్నాలుగా గౌరవించడం), మంత్రిత్వ శాఖ సంస్కృతి (స్వర్ణిమ్ భారత్: వారసత్వం, అభివృద్ధి), సీపీడబ్ల్యూడీ (పుష్ప శకటంతో 75 సంవత్సరాల భారత రాజ్యాంగం) శకటాలను ప్రదర్శించనున్నాయి.