నీట్‌ యుజీలో ఆకాష్‌ బైజూస్‌ విద్యార్థికి 285 ర్యాక్

– అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య విద్య ప్రవేశ పరీక్షలో 720కు గాను 700 సాధించిన ప్రహర్ష్‌ పటేల్‌ కొతం
నవతెలంగాణ – వరంగల్‌: వరంగల్‌లోని ఆకాష్‌ బైజూస్‌ విద్యార్ధి ప్రహర్ష్‌ పటేల్‌ కొతం, ఆకాష్‌ బైజూస్‌ కు గర్వకారణంగా నిలుస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రవేశ పరీక్ష (నీట్‌) యుజీ 2023 లో ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 285 సాధించి తన తల్లిదండ్రులకు మరియు ఇనిస్టిట్యూట్‌ వద్ద మొత్తం సిబ్బందికి గర్వకారణంగా నిలిచాడు. ప్రతిష్టాత్మకమైన వైద్య ప్రవేశ పరీక్షలో 720కు గాను 700 మార్కులు అతను సాధించాడు. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిన్న రాత్రి ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా గుర్తింపు పొందిన నీట్‌లో ర్యాంకు సాధించేందుకు ఆకాష్‌ బైజూస్‌ లో రెండు సంవత్సరాల క్లాస్‌రూమ్‌ మరియు లైవ్‌ ప్రోగ్రామ్‌ లో అతను చేరాడు. కాన్సెప్ట్స్‌ అర్థం చేసుకోవడం, అభ్యాస షెడ్యూల్స్‌కు ఖచ్చితంగా కట్టుబడి ఉండటం కారణంగానే టాప్‌ పర్సంటైల్‌ సాధించిన వారి సరసన తాను  నిలువగలిగానన్నాడు. ‘‘ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ నాకు ఈ రెండు అంశాలలోనూ ఎంతగానో తోడ్పడింది. వారి కోచింగ్‌, కంటెంట్‌ కారణంగానే అతి తక్కువ సమయంలోనే విభిన్నమైన బోధనాంశాలను మెరుగ్గా ఆకలింపు చేసుకోవడం సాధ్యమైంద’’ని అతను వెల్లడించాడు. ప్రహర్ష్‌ పటేల్‌ కొతంను అభినందించిన శ్రీ అభిషేక్‌ మహేశ్వరి, సీఈఓ, ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) మాట్లాడుతూ ‘‘ అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థును మేము అభినందిస్తున్నాము. ప్రహర్ష్‌ విజయం అతని కష్టం, అంకిత భావాన్ని గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడుతుంది. అతను సాధించిన విజయం, అతని కష్టం మరియు అంకిత భావం తో పాటుగా అతని తల్లిదండ్రుల మద్దతు మరియు తగిన మార్గనిర్ధేశనం చేసిన ఫ్యాకల్టీ , అలాగే ఇనిస్టిట్యూట్‌ అందించిన మద్దతు గురించి వెల్లడిస్తుంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను ప్రహర్ష్‌ సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాలను గురించి ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీ ధీరజ్‌ మిశ్రా మాట్లాడుతూ ‘‘అసాధారణ విజయం సాధించిన మా విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నాము. అత్యుత్తమ స్కోర్‌ సాధించిన విద్యార్థుల ప్రతిభ, అంకిత భావం ఈ ఫలితాల్లో కనిపిస్తుంది. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ఆకాష్‌ బైజూస్‌ ఫ్యాకల్టీకి మేము అభినందనలు తెలుపుతున్నాము. వారు అవిశ్రాంతంగా విద్యార్థులకు మద్దతు అందించడంతో పాటుగా వారి అనుమానాలు, సందేహాలు తీరుస్తున్నారు. ఆకాష్‌ బైజూస్‌ అందించే కరిక్యులమ్‌తో పాటుగా మా విద్యార్థుల నిబద్ధత ఈ విజయానికి కీలకంగా మారింది’’ అని అన్నారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ (ఎంబీబీఎస్‌), డెంటల్‌ (బీడీఎస్‌) మరియు ఆయుష్‌ (బీఏఎంఎస్‌, బీయుఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ మొదలైనవి) కోర్సులలో భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇనిస్టిట్యూట్‌లలో ప్రవేశం కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రతి సంవత్సరం నీట్‌ ను అర్హత పరీక్షగా నిర్వహిస్తుంది. నీట్‌ 2023 కోసం దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Spread the love