బిఐఎస్ కార్నివాల్ లో ప్రభుత్వ పాఠశాలకు ద్వితీయ బహుమతి..

Second Prize for Govt School in BIS Carnival..నవతెలంగాణ – భిక్కనూర్
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కార్నివాల్ 2025 లో పట్టణ కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు ద్వితీయ బహుమతి లభించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ తెలిపారు. శనివారం హైదరాబాద్ లో  జరిగిన బిఐఎస్ స్టాండర్డ్స్ కార్నివాల్ 78వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సంఘమిత్ర పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. బిఐఎస్ ఆహ్వానం మేరకు ప్రధానోపాధ్యాయుల శ్రీనాథ్, సైన్స్ ఉపాధ్యాయులు రాజు, సరిత ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు నందిని, మహేష్, కీర్తన, విశ్వక్ రాజు రూపొందించిన ప్రదర్శన ఫార్మర్స్ బాటన్, ఇన్సెక్ట్ రిపెలెంట్, స్మార్ట్ ఇరిగేషన్ ఫర్ అగ్రికల్చర్ ప్రదర్శనకు ద్వితీయ బహుమతి లభించిందని తెలిపారు.  ద్వితీయ బహుమతిని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శిల్పవల్లి, బిఐఎస్ అధికారి పీవీ శ్రీకాంత్ ఉత్తమ ప్రదర్శనకు విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి అందజేశారు. ద్వితీయ బహుమతి రావడం పట్ల విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
Spread the love