రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ‘జరగండిి..’ సాంగ్, వస్తోన్న అప్డేట్లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ నెలలో సినిమా నుంచి మరో సాంగ్‌కి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు.