3.30 కేజీల గంజాయి పట్టివత 

– రెండు కేసులు నమోదు
– నలుగురిపై కేసు నమోదు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
3.30 కేజీల గంజాయిని పట్టుకుని రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని, నలుగురిపై కేసు నమోదు చేశామని నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సీఐ స్వప్న, వెంకటేష్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో రెండు కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శతకోటి ఉపాయాలకు అనంత కోటీ మార్గాలు అన్నట్లుగా..  గంజాయిపై దాడులు నిర్వహిస్తూ కట్టిడి చేస్తున్న కూడ ఎక్కడో ఒక దగ్గర  గంజాయి అమ్మకాలు, రవాణను అక్రమార్కులు కొనసాగిస్తూనే ఉన్నారు.  ఐనా పట్టువదులని విక్రమార్కుడి రీతిలో ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్ మెంట్‌ పోలీసులు దాడులు నిర్వహిస్తు గంజాయిని పట్టుకుంటున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో  రెండు వేర్వేరు కేసుల్లో 3.30 కేజీల గంజాయిని ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్ మెంట్‌  పోలీసులు పట్టుకున్నారు. కేసులకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్ ఎక్సైజ్‌ పోలీస్‌ పరిధిలోని వెల్పూర్‌  వద్ద  యువకుడు 210 గ్రాముల  గంజాయితో పట్టుబడ్డాడు. పట్టుబడిన నిందితుడిని గంజాయి ఎక్కడి నుంచి తీసుక వచ్చావని అడిగితే ఆదిలాబాద్‌ జిల్లా భైంసా నుంచి ముజాయిద్‌ఖాన్‌ అనే వ్యక్తి దగ్గరి నుంచి తీసుక వచ్చినట్లు సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ మెంట్‌ సీఐలు స్వప్న, వెంకటేష్‌లు సిబ్బంది కలిసి  పట్టబడిన నిందితుడి తో రెండు కిలోల గంజాయిని అర్డర్‌ చేశారు. బైంసా  నుంచి ముజాయిద్‌ ఖాన్‌ బైక్‌పై గంజాయిని తీసుకవచ్చాడు. ఎన్ఫోర్స్మెంట్ మెంట్‌ పోలీసులను చూసి బైక్‌ పారవేసి ఆడవిలోకి పారిపోయాడు. బైక్‌లో ఉన్న  గంజాయిని తూకం వేయగా 2.10కిలో గంజాయిగా ఉంది. ఈ కేసులో    ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఒక నిందితుడు పారిపోవడం తో పాటు మిగిలిన రిశ్వంత్‌ ను అరెస్టు చేశారు. నిజమాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో కేసులో కిలో గంజాయిని ఎన్ఫోర్స్ మెంట్‌ పోలీసులు పట్టుకున్నారు.  ముగ్గురిపై కేసు  నమోదు చేశారు.  నిందితుల నుంచి బైకులు, సేల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈరెండు గంజాయి కేసుల్లో సీఐల తో పాటు   ఎస్సై నర్సింహచారీ, ఉత్తమ్‌, బోజన్న, రాంబచన్‌, ఆశన్న, హమీద్‌, విష్ణు,  అవినాష్‌, మంజుల, సుకన్యలు పాల్గన్నారు. ఈ రెండు కేసుల్లో గంజాయిని    పట్టుకున్న  సిబ్బంది డిప్యూటి కమిషనర్‌ సోమిరెడ్డి అభినందించారు.
Spread the love