నల్లగొండ జిల్లాలో బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

నవతెలంగాణ – నల్లగొండ: నల్లగొండ జిల్లాలో బస్సు బోల్తా పడింది. ఈ తరుణంలోనే..30 మంది ప్రయాణికులకు గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఈ రోజు ఉదయం  చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలో శ్రీ కృష్ణ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. అయితే.. ఈ సంఘటన లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది శ్రీ కృష్ణ బస్సు. ఈ ట్రావెల్స్ బస్సు హైదరాబాదు నుంచి ఒంగోలుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.  బస్సు ప్రమాద గురైన సమయంలో ఆ బస్సులో 30 మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో అందరికీ గాయాలు అయ్యాయని సమాచారం. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు కారణమని భావిస్తున్న పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love