ఓర్వకల్లులో 30 మందికి అస్వస్థత

నవతెలంగాణ – కర్నూలు: ఓర్వకల్లులో 30 మందికి అస్వస్థత చోటు చేసుకుంది. వాంతులు, జర్వం, విరేచనాలతో అస్వస్థకు గురైన భాదితులను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని అస్వస్థతకు గల కారణాలను కర్నూలు ఆర్డీవో హరి ప్రసాద్ అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీటి వలననా లేక ఫుడ్ పాయిన్ వలన జరిగిందా? లేదంటే మరొక కారణమా? అన్నది తెలియాల్సి ఉంది. గ్రామంలో నీటి, ఫుడ్ నమూనాలు సేకరిస్తున్నామని కర్నూలు ఆర్డీవో హరి ప్రసాద్ వెల్లడించారు.

Spread the love