మండలంలో 30 వేలు మొక్కలు

నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని 30 పంచాయితీల్లో పంచాయితీకి 1000 మొక్కలు చొప్పున 30 వేలు మొక్కలు నాటారు అని ఎం.పి.డి.ఒ శ్రీనివాస్ తెలిపారు. శనివారం తెలంగాణ కు హరిత హారం లో భాగంగా ఒక్క రోజులో కోటి మొక్కలు లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ఎ.పి.ఎం నరేష్,సర్పంచ్ నార్లపాటి సుమతి పాలక వర్గం సభ్యులు పాల్గొన్నారు.
Spread the love