ఖమ్మం మీదుగా నడిచే 30 రైళ్లు రద్దు…

నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేట –విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్​పనుల కారణంగా ఖమ్మం మీదుగా విజయవాడ, వరంగల్​ వైపు వెళ్లే పలు రైళ్లను ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. అయితే రద్దయిన రైళ్లలో కొన్నింటిని నిర్ణీత తేదీల్లో నడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. భద్రాచలం -విజయవాడ, డోర్నకల్​ విజయవాడ ప్యాసింజర్లు, గోల్కొండ, శాతవాహన, ఇంటర్​సిటీ ఎక్స్ప్రెస్​ రైళ్లను ఈనెల 10 నుంచి పది రోజుల వరకు రద్దు చేశారు. ఖమ్మం మీదుగా నడిచే 107 రైళ్లలో 30 రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.

Spread the love