లిస్బన్ : క్యూబన్ డాక్టర్లను తమ దేశంలో నియమించుకోవడం పోర్చుగల్‌కు ఇదే మొదటిసారి కాదు. 2009లో పోర్చుగీస్ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలోకి 44మంది డాక్టర్లను స్వాగతించింది. తాజాగా 300మంది క్యూబన్ డాక్టర్లను జాతీయ ఆరోగ్య సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) లోకి తీసుకోవడం ద్వారా ఆరోగ్య వ్యవసథను బలోపేతం చేయాలని ప్రధాని ఆంటానియో కోస్టా భావిస్తున్నారు. వీరు పోర్చుగల్‌లో మూడేళ్ళపాటు పనిచేస్తారు. సాధ్యమైనంత త్వరలో వీరిని చేర్చుకునేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. యురోపియన్ భూభాగానికి వెలుపల వుండే విదేశీయులు ఇటువంటి వాటికి అర్హత సాధించాలంటే పలు చర్యలు తీసుకోవాల్సి వుంది. ముందుగా ఈ డాక్టర్లందరూ పోర్చుగల్‌లో పలు పరీక్షలను ఎదుర్కొనాల్సి వుంటుంది. ఈ పరీక్షలు కేవలం మెడిసిన్‌లోనే కాదు, ఇతరత్రా కూడా వుంటాయి. వీరికి పోర్చుగీస్ భాష కూడా వచ్చి వుండాలి.