సభలో చర్చకు 31 బిల్లులు

– పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి
న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. అయితే, ఈ సమావేశాల్లో కేంద్రం మొత్తం 31 బిల్లులను చర్చకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. వర్షకాల సమావేశాలు షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. 17 సిట్టింగ్‌లలో జరిగే పార్లమెంటు సమావేశాలు సాఫీగా జరగటం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి 34 పార్టీల నుంచి 44 మంది లీడర్లు పాల్గొన్నారని ఆయన చెప్పారు.
బిల్లులు
1. గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023
2. ది సినిమాటోగ్రాఫ్‌ (సవరణ) బిల్లు, 2019
3. డీఎన్‌ఏ టెక్నాలజీ (యూజ్‌ అండ్‌ అప్లికేషన్‌) రెగ్యులేషన్‌ బిల్‌, 2019
4. ది మీడియేషన్‌ బిల్‌, 2021
5. ది బయోలాజికల్‌ డైవర్సిటీ (సవరణ) బిల్లు, 2022
6. బహుళ రాష్ట్ర సహకార సంఘాలు (సవరణ) బిల్లు, 2022
7. ది రిపీలింగ్‌ అండ్‌ అమెండింగ్‌ బిల్‌, 2022
8. ది జన్‌ విశ్వాస్‌ (నిబంధనల సవరణ) బిల్లు, 2023
9. అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు, 2023
10. ది కాన్‌స్టిట్యూషన్‌ (షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌) ఆర్డర్‌ (మూడో సవరణ) బిల్లు, 2022 (హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించినది)
11. ది కాన్‌స్టిట్యూషన్‌ (షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌) ఆర్డర్‌ (ఐదో సవరణ) బిల్లు, 2022 ( ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి సంబంధించినది)
12. తపాల సేవల బిల్లు, 2023
13. జాతీయ సహకార విశ్వవిద్యాలయ బిల్లు, 2023
14. పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాలు (సవరణ) బిల్లు, 2023
15. డిజిటల్‌ పర్సనల్‌ ప్రొటెక్షన్‌ బిల్‌, 2023
16. అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు బ్యాంక్‌ బిల్‌, 2023
17. పన్నుల తాత్కాలిక సేకరణ బిల్లు, 2023
18. జాతీయ దంత కమిటీ బిల్లు, 2023
19. నేషనల్‌ నర్సింగ్‌ మరియు మిడ్‌వైఫరీ కమిషన్‌ బిల్లు, 2023
20. మందులు, వైద్య పరికరాలు మరియు కాస్మోటిక్స్‌ బిల్‌, 2023
21. జననాలు మరియు మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2023
22. జమ్మూ మరియు కాశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు, 2023
23. సినిమాటోగ్రాఫ్‌ (సవరణ) బిల్లు, 2023
24. ది ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్‌, 2023
25. ది అడ్వొకేట్స్‌ (సవరణ) బిల్లు, 2023
26. గనులు మరియు ఖనిజ (అభివృద్ధి మరియు నియంత్రణ) బిల్లు
27. రైల్వేలు (సవరణ) బిల్లు, 2023
28. నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ బిల్లు, 2023
29. రాజ్యాంగం (జమ్మూ మరియు కాశ్మీర్‌) షెడ్యూల్డ్‌ కులాల ఆర్డర్‌ (సవరణ) బిల్లు, 2023
30. రాజ్యాంగం (షెడ్యూల్డ్‌ కులాలు) ఆర్డర్‌ (సవరణ) బిల్లు, 2023
31. రాజ్యాంగం (జమ్మూ మరియు కాశ్మీర్‌) షెడ్యూల్డ్‌ తెగలు ఆర్డర్‌ (సవరణ) బిల్లు, 2023

Spread the love