నవతెలంగాణ-హాయత్ నగర్
కార్ అతి వేగానికి 33కేవీ లైన్ పోల్ విరిగి భారీ ప్రమాదం తగ్గింది.నాగోల్ డివిజన్ పరిధిలోని స్రవంతి ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్న శుభ్రమణ్యం అనే వ్యక్తి తన ఏ పీ 29ఏ వై 2322గల కార్ లో బుధవారం సాయంత్రం వేళలో బండ్ల గూడ నుండి మన్సూరాబాద్ కు వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఉన్న హరిన వనస్థలి పార్క్ వద్ద ఉన్న 33కేవీ విద్యుత్ పోల్ ను అతి వేగంతో డీ కొనడంతో ముందు భాగం పూర్తిగా పోల్ ను డీ కొనగా పోల్ విరిగింది. కార్ ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదని,చికిత్స నిమిత్తం108లో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి విద్యుత్ అధికారులు డీఈ సంగమేశ్వర్, ఏ ఈ కిరణ్ కుమార్ రెడ్డి లు విచ్చేసి అక్కడ మరమ్మతులు చేపడుతున్నారు.మొత్తం 3సబ్ స్టేషన్ లకు అనగా రంగారెడ్డి జిల్లా కోర్ట్, కొత్తపేట, ఇండోర్ స్టేడియం, కామినేని పరిధిలో విద్యుత్ సరఫరా అవుతున్నట్లు తెలిపారు. అతనిపై యల్ బి నగర్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశామని, మొత్తం ఒక లక్ష మేర నష్టం వాటిల్లిందని వెల్లడించారు.విద్యుత్ సరఫరా ఎక్కడా ఆగకుండా వేరే సబ్ స్టేషన్ కు కనెక్షన్ చేశామన్నారు.